తిట్టుకోకండ్రా!! నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను.. గేమ్ ఛేంజర్ అప్డేట్స్ పై దిల్‌రాజు

-

రామ్‌చరణ్‌ – శంకర్ కాంబోలో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. కియారా అడ్వాణీ హీరోయిన్. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకల్లో సినీ ప్రముఖులు సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు ‘గేమ్‌ ఛేంజర్‌’ అప్డేట్స్పై ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. అభిమానులను ఉద్దేశిస్తూ.. ‘‘మీ ఓపికకు ఎంతో పరీక్ష పెడుతున్నాం. ఒక తుపాను వచ్చే ముందు కాస్త ఓపిక పట్టక తప్పదు. రామ్‌చరణ్‌ ఇప్పుడు మెగా పవర్‌స్టార్‌ కాదు.. గ్లోబల్‌ స్టార్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత వస్తోన్న సినిమా కాబట్టి ఆ స్థాయికి రీచ్‌ అయ్యేలా శంకర్‌ దీనిని తీర్చిదిద్దుతున్నారు. మరో రెండు నెలల్లో షూట్‌ పూర్తి కానుంది. ఐదు నెలల్లో రిలీజ్‌ చేస్తాం.” అని చెప్పుకొచ్చారు.

ఠఐదు నెలలు కాస్త నన్ను తిట్టుకోకుండా ఓపిక పట్టండి. ‘దిల్‌ మామా.. మాకొక అప్‌డేట్‌ ఇవ్వు’ అంటూ మీరు పెడుతున్న కామెంట్స్‌ చూస్తున్నా. ఈ చిత్రానికి సంబంధించి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను. శంకర్‌ అప్‌డేట్‌ ఇవ్వమంటే నేను ఇస్తా అంతే’’ అని దిల్‌ రాజు అభిమానుల ఆశలపై నీళ్లు జల్లారు.

Read more RELATED
Recommended to you

Latest news