అమెరికాలో జాతిరత్నాలు హీరోకి యాక్సిడెంట్ ?

-

జాతిరత్నాలు  హీరో నవీన్ పొలిశెట్టికి అమెరికాలో యాక్సిడెంట్ అయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అమెరికా వీధుల్లో బైక్ పై వెళ్తున్న సమయంలో బైకు స్కిడ్ అయి కిందపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన చేతికి ఫ్రాక్చర్ అయిందట. చేతికి బలమైన గాయం అవడం వల్ల రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందేనని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. దీంతో ఈ హీరో కొంతకాలంపాటు సెట్ కి దూరంగా ఉండనున్నట్టు సమాచారం.

 

అయితే  ఈ యాక్సిడెంట్ వార్తలపై నవీన్ పొలిశెట్టి స్పందించాల్సి ఉంది. ఇటీవలే నవీన్ పొలిశెట్టి మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటించాడు. ఇందులో హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించింది. పి.మహేష్ బాబు దర్శకత్వం ఈ సినిమాని వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటించనున్నాడు నవీన్ పొలిశెట్టి.

Read more RELATED
Recommended to you

Latest news