బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ .. ప్రభాస్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ పలువురు సెటబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా టాలీవుడ్ నిర్మాత శ్రీనివాస కుమార్ (ఎస్కెఎన్) కూడా దీనిపై స్పందించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన ఎక్స్‌లో ఓ నెటిజన్ పోస్ట్‌కు ఆయన కామెంట్ పెట్టారు.
‘కల్కి 2898 ఏడీ’లో ప్రభాస్ పాత్ర జోకర్లా ఉందంటూ అర్షద్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్‌ను ఇలాంటి పాత్రలో చూడటం బాధగా అనిపించిందని.. తనకు సినిమా కూడా పెద్దగా నచ్చలేదని చెప్పారు. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్ర ముందు ప్రభాస్ పాత్ర తేలిపోయిందని అన్నారు. అర్షద్ వార్సీ కామెంట్స్‌పై ఓవైపు అభిమానులు ఫైర్ అవుతుంటే తాజాగా నిర్మాత శ్రీనివాస కుమార్ కూడా స్పందించారు. ‘‘సినిమాకు రివ్యూ ఇవ్వచ్చు.. దాన్ని విమర్శించవచ్చు. కానీ, మిస్టర్ అర్షద్ వార్సీ మాట్లాడిన మాటలు నిర్మాణాత్మకమైన విమర్శలుగా లేవు. కొంచెం ఆలోచించి మాట్లాడి ఉంటే బాగుండేది’ అని అన్నారు.