PS-1..3 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరిక..!

-

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్లో తెరకెక్కిన భారీ తారాగణం తో నటించిన చిత్రం పొన్నియన్ సెల్వన్.. సెప్టెంబర్ 30వ తేదీన అన్ని భాషలలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా పర్వాలేదని కొంతమంది చెబుతుంటే.. మరి కొంతమంది అసలు బాగోలేదు అంటున్నారు. ఇకపోతే తమిళ్ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ అని, ఒక పెద్ద కళాఖండం అని కూడా చెప్పుకొస్తున్నారు. అంతేకాదు మొదటి రోజే ఏకంగా కేవలం తమిళనాడులోని రూ.27 కోట్ల కలెక్షన్ రాబట్టింది. దీన్ని బట్టి చూస్తే తమిళ్ ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతగా ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

సినిమా చూస్తున్నంత సేపు మణిరత్నం కష్టపడిన తీరు కనిపిస్తున్న మణిరత్నం స్టైల్ అయితే లేదని కొంతమంది చెప్పుకొస్తున్నారు. ఇకపోతే చిన్న చిన్న పాత్రలకు కూడా భారీ తారగణాన్ని తీసుకొని తప్పు చేశారని మరికొంతమంది కూడా భావిస్తున్నారు.. మూడు రోజుల్లోనే ఏకంగా రూ.200 కోట్ల వసూళ్లను రాబట్టి ఫ్లాప్ టాక్ లో కూడా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఇక చెప్పాలంటే మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్లు తమిళనాడులో రూ.27.03 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.5.93 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.3.5 కోట్లు.. ఓవర్ సీస్లో రూ.35 కోట్లు పైగా రాబట్టింది.

ఇకపోతే కేవలం ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మూడు రోజుల్లోనే రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఇందులో నటీనటులుగా బాలీవుడ్, కోలీవుడ్ నటులను ఎంచుకోవడం జరిగింది. అందులో విక్రమ్, కార్తీ, ప్రకాష్ రాజ్ , జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, శోభిత ధూళిపాళ్ల తదితరులు ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు ఐశ్వర్యరాయ్ నటించిన నందిని చిన్నప్పటిపాత్ర లో సారా అర్జున్ నటించి అందరి చూపును తన వైపు తిప్పుకున్న విషయం తెలిసిందే. మొత్తానికైతే ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూ.200 కోట్లు కాబట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version