ఆ ఆంటీతో పూరికి ఏం పని..!

-

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఓ పక్క జరుగుతుంది. అయితే లేటెస్ట్ గా పూరి యూట్యూబ్ లో హడావిడి చేసే లోకులు కాకులు ఆంటీతో దిగిన పిక్స్ ఇప్పుడు అందరిని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. లోకులు కాకులు ఆంటీ అలియాస్ జ్యోతి అసలు ఎందుకు పూరిని కలిసింది.

ఒకవేళ పూరి ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఆమెకు ఓ పాత్ర ఇచ్చాడా.. సినిమా ఛాన్స్ కాకపోయినా యూట్యూబ్ లో ఆమె చేస్తున్న హంగామా చూసి పూరి పిలిపించి ఉంటాడా అని రకరకాల వార్తలు వస్తున్నాయి. మాములుగానే హడావిడి ఎక్కువ చేసే లోకులు కాకులు ఆంటీ పూరిని కలిసిన ఉత్సాహంతో ఇంకా రెచ్చిపోతుంది. ఆ ఆంటీతో పూరి ఏం చేయబోతున్నాడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

Read more RELATED
Recommended to you

Latest news