కూతురు కోసం అలాంటి పని చేసి షాక్ ఇచ్చిన పుష్ప డైరెక్టర్..!

-

రంగస్థలం, పుష్ప వంటి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్న సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చింది తక్కువ సినిమాలే అయినా మెజారిటీ సినిమాలు మాత్రం సక్సెస్ సాధిస్తున్నాయి. ఇక ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా సుకుమార్ తన కూతురి కోసం ఒక పని చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. అసలు విషయంలోకి వెళితే సుకుమార్ తన కూతురికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టమట. ఇక ఈ కోర్స్ కోసం తన కూతురితో ఆయన అమెరికాకు వెళ్లినట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.

సుకుమార్ ఒకవైపు తన డైరెక్షన్లో సినిమాలను తెరకెక్కిస్తూనే.. ఇంకొక వైపు తన అసిస్టెంట్ డైరెక్టర్లను డైరెక్టర్లుగా మారుస్తూ వారి సినిమాలకు కథలు, కథనం అందిస్తూ ఆ సినిమాలను కూడా సక్సెస్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక తన దగ్గర శిష్యరికం పొందుతున్న వారి కోసమే అంత ఆలోచించారంటే ఇక కన్న కూతురి కోసం ఆయన ఎంత ఆలోచించి ఉంటారు.. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మ్యూజిక్ లో తన కూతురు శిక్షణ తీసుకున్నారని.. అమెరికాలోని ప్రతిష్టాత్మక మ్యూజిక్ సంస్థల్లో క్రాస్ కోర్స్ కోసం సుకుమార్ ఆయన కూతురు అమెరికా వెళ్లి ఆ కోర్స్ ఫీజు కోసం 6 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు సమాచారం.

పిల్లల అభిరుచి కోసం సుకుమార్ ఖర్చు విషయంలో వెనకాడడం లేదు అని.. డబ్బు కంటే కూతురి సంతోషమే ముఖ్యమని ఆయన భావిస్తున్నారని అభిమానులు ఆయన చేసిన పనికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ప్రతి ఒక్కరూ బాగుండాలి.. అందులో నేనుండాలి అని ఆలోచించే వారిలో సుకుమార్ కూడా ఒకరు అని కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news