తాను అనుకున్నది చేయడంలో మొండిగా ముందుకు దూసుకెళ్లడంలో జగన్‌ని మించిన వారు లేరు. ఎదుట ఎలాంటి వారు ఉన్న లెక్క చేయరు. తాను అనుకున్నది చేసేస్తారు. రాజకీయాల్లో ఎంతటి వారైనా జగన్ ముందు తలోగ్గాల్సిందే. అందుకే 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు చుక్కలు చూపించారు..చూపిస్తున్నారు కూడా. ఇక ప్రజల మేలు కోసం జగన్ ఎలాంటి నిర్ణయాలైన తీసుకోవడానికి వెనుకాడరు.
అలాగే రాజకీయంగా తన పార్టీ గెలవడానికి ఎలాంటి వారినైనా పక్కన పెట్టడానికి వెనుకాడరు. అందుకే పార్టీ గెలుపు కోసం సరిగ్గా పనిచేయని నేతల్లో..ఎలాంటి వారు ఉన్నా సరే వారిని పక్కన పెట్టేస్తానని జగన్ చెప్పేస్తున్నారు. జగన్‌కు మొహమాటలు ఉండవు. అనుకున్నది చేస్తారు. రాజకీయాల్లో ప్రత్యర్ధులని చూసి భయపడరు..ప్రత్యర్ధులనే టెన్షన్ పెడతారు. ఇక గెలుపు కోసం ఎంత దూరమైన వెళ్తారు.
అయితే ఈ సారి ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలని చూస్తున్న జగన్..ఈ సారి 175కి 175 సీట్లు గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అంటే అందులో చంద్రబాబు కంచుకోట కుప్పం కూడా ఉంది. కుప్పం కూడా గెలిచేస్తామనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కానీ ఒక టిడిపి ఎమ్మెల్యే మాత్రం వైసీపీకి టెన్షన్ గానే ఉన్నారు. ఆయనే పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. పూర్తిగా ప్రజల మధ్యే ఉంటూ..సైకిల్ వేసుకుని నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే నిమ్మలని పాలకొల్లులో ఓడించడం అంత ఈజీ కాదు.
నిమ్మలకు చెక్ పెట్టడానికి పాలకొల్లు వైసీపీ ఇంచార్జ్ కవురు శ్రీనివాస్‌కు జెడ్పీ ఛైర్మన్ ఇచ్చారు. ఎమ్మెల్సీ చేశారు. అయినా సరే అక్కడ కవురు బలం పెరగడం లేదు. కేవలం నిమ్మల హవానే ఉంది. ఇక్కడ జనసేన బలం తక్కువే. ఇక్కడ ఏ వర్గం ప్రజలైన నిమ్మల వైపే మెజారిటీ ఉంది. ఈ సారి కూడా ఈయన గెలుపు ఆపడం కష్టమని అంటున్నారు. మొత్తానికి నిమ్మల..వైసీపీకి గట్టి ప్రత్యర్ధి అయ్యారు.