ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. APలో కొత్తగా సౌర విద్యుత్ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అనంతపురం, తిరుపతి, విజయవాడ నగరాల్లో 12 చోట్ల వీటిని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ కేంద్రాల ద్వారా కార్డుతో చార్జింగ్ ఫీజు చెల్లించి… వాహనదారుడె స్వయంగా చార్జింగ్ పెట్టుకోవచ్చు.
ట్రాఫిక్ కు ఇబ్బంది లేని చోట్ల వీటిని ఏర్పాటు చేయనుండగా… సౌర ప్యానళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ బ్యాటరీతో స్టోర్ అవుతుంది. కాగా, అమరావతిలోని కృష్ణయపాలెంలో సీఎం జగన్ ఈనెల 24వ తేదీన పర్యటించనున్నారు. జగనన్న లేఅవుట్లలో గృహ నిర్మాణ శంకుస్థాపన, 47,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను సీఎం జగన్ అందించనున్నారు. ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ, అనంతరం ఇటుకల తయారీ యూనిట్, పైలాన్ ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వెంకటపాలెంలో జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.