వారం లో రూ. 229 కోట్ల గ్రాస్ వ‌సూల్ చేసిన పుష్ప

ఇటీవ‌ల విడుద‌ల అయిన పుష్ప మొద‌టి పార్ట్ క‌లెక్ష‌న్లుతో దూసుకుపోతుంది. విడుద‌ల అయిన తొలి వారం లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 229 కోట్ల గ్రాస్ ను వ‌సూల్ చేసింద‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించింది. దీంతో త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ కలెక్ష‌న్లు వ‌సూల్ చేసిన సినిమాలతో పుష్ప కూడా చేరింది. అలాగే రానున్న రోజుల్లో ఈ సినిమా క‌లెక్ష‌న్లు మ‌రింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాగ టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్, ఐక‌న్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేష‌న్ లో ఈ సినిమా విడుద‌ల అయింది. హీరోయిన్ గా నేష‌నల్ క్ర‌ష్ ర‌ష్మిక న‌టించింది.

అలాగే ఐటెం సాంగ్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత న‌టించింది. ఈ ఐటెం సాంగ్ ఎన్నో రికార్డుల‌ను సృష్టించింది. ఆ పాట‌ల‌తో పాటు ఈ సినిమాలో అన్నీ పాట‌లు కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. కాగ ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచే సినిమా పై భారీ అంచ‌నాలు పెరిగిపోయాయి. అనంత‌రం విడుద‌ల అయిన పాట‌లు, టీజ‌ర్, ట్రైల‌ర్ ల‌తో భారీ అంచ‌నాలు పెరిగాయి. విడుద‌ల త‌ర్వాత అంచ‌నాలను అందుకుంటూ రికార్డు ల‌ను సృష్టిస్తూ సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది.