పుష్ప రాజ్ ”పీలింగ్స్” చూసారా..!

-

నాలుగు రోజుల్లో అభిమానుల ముందుకు రానున్న పుష్ప 2 సినిమా ను పీలింగ్స్ అంటూ మరో కొత్త సాంగ్ బయటకు వచ్చింది. ఇక అల్లు అర్జున్ కొన్ని రోజుల కింద కేరళలో జరిగిన ఈవెంట్ లో చెప్పిన విధంగా ఈ పాటను తన మలయాళీ ఫ్యాన్స్ కోసం అంకితం చేస్తున్నట్లు.. పాట పల్లవి మొత్తం మలయాళం లోనే ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా పుష్ప 2 సినిమా విడుదల అయిన ప్రతి భాషలో ఈ లిరిక్స్ మలయాళంలోనే ఉంటాయి అని బన్నీ అప్పుడే చెప్పేసాడు.

 

అయితే ఈ పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్, రష్మిక తమ స్టెప్స్ తో ఫ్యాన్స్ ఊగించేస్తునారు. వారిని తగ్గట్లుగా మొత్తం మాస్ స్టెప్స్ తో ఈ పీలింగ్స్ పాట సాగుతుంది. ఇక డిసెంబర్ 5న థియేటర్లలోకి రానున్న పుష్ప 2 బుకింగ్స్ మొదలయ్యాయి. చాలా థియేటర్లలో ఇప్పటికే వారం రోజుల వరకు టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

Read more RELATED
Recommended to you

Latest news