సన్న వడ్లకు ప్రభుత్వం 500 రూపాయల బోనస్ అందించడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అధికంగా లాభం చేకూరుతుందని, రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రాధాన్యతను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని, 2 లక్షల రుణమాఫీ, సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ పథకాల లబ్ధి పొందుతున్న రైతులతో వీడియోలు చేసి ప్రచారం చేయాలని , గ్రామాలలో లబ్ధిదారుల జాబితా ప్రదర్శించాలన్నారు.
చిన్న కాళేశ్వరం ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైందని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ త్వరగా చేపట్టాలన్నారు. దేవాదుల ప్రాజెక్టుగా సంబంధించి మరిన్ని అవుట్ లెట్ నిర్మాణం చేయాలన్నారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మించడం వల్ల 2.4 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్తగా మరో 15 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు. పోతారం ఎత్తిపోతలకు పథకం, భీం ఘనపూర్ ఎత్తిపోతల పథకం పనుల ప్రతిపాదనలు అందజేయాలన్నారు శ్రీధర్ బాబు.