అభిమానులకు మళ్లీ నిరాశ మిగిల్చిన పుష్ప రాజ్.. రిలీజ్ డేట్ లాక్..!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప పార్ట్ వన్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. నేషనల్ అవార్డును కూడా అల్లు అర్జున్ ఈ సినిమాతో సొంతం చేసుకున్నాడు. దీంతో రాబోయే పుష్ప 2 సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా ఊహించని స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు సుకుమార్ ఈసారి పుష్పరాజ్ ను అంతకుమించి అనేలా వెండితెరపై ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక పూర్తిస్థాయిలో హైడోస్ యాక్షన్ డ్రామాగా సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు చూస్తే అర్థమవుతుంది.

ఇకపోతే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. మొదట సినిమాను సమ్మర్ కు విడుదల చేయాలనుకున్నప్పటికీ 2024 మార్చి నెలలోనే విడుదల చేస్తామని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ ప్రణాళికలు రచించుకున్నారు. కానీ సినిమా కథ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ కోసం ఈసారి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల రిలీజ్ డేట్ ను వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఎట్టకేలకు ఆగస్టు 15 2024న విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధం అవుతున్నారు. అంతేకాదు అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ని కూడా విడుదల చేశారు.

అల్లు అర్జున్ ఈ పోస్టర్లో స్టైల్ గా కుర్చీపై కూర్చున్న స్టిల్ వైరల్ అవుతుంది. ఫేస్ ఫుల్ గా రివీల్ చేయలేదు కానీ కేవలం అతని చేయికి సంబంధించిన ఫోటోతోనే ఊహించని విధంగా సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు. చూపుడు వేలుకు దేవుడు ఉంగరం… ఉంగరం వేళ్ళకి రంగురాళ్ల ఉంగరం ఉండగా.. చివరి చిటికెన వేలును మాత్రం అమ్మాయి వేలి తరహాలో హైలెట్ చేయడం హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఇక పుష్ప రాజ్ నెవర్ బిఫోర్ అనేలా ఈసారి సరికొత్తగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంతో ఓ రకంగా సస్పెన్స్ క్రియేట్ అయినప్పటికీ కూడా ఇంకా సంవత్సరం పాటు ఎదురు చూడాల్సిందే అని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news