PUSHPA TWITTER REVIEW : దుమ్ములేపుతున్న పుష్ప రాజ్

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో పుష్ఫ‌ భారీ బడ్జెట్ తో తెర‌కెక్కించారు. ఈ సినిమా లో మొద‌టి భాగాన్ని పుష్ప ది రైజ్ అనే పేరుతో నేడు పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల చేశారు. ఈ సినిమా కు సంబంధించి మొద‌టి అప్ డెట్ నుంచే ఈ సినిమా పై భారీ గా అంచ‌నాలు పెరిగిపోయాయి. దానికి తోడు ట్రైల‌ర్, పాట‌లతో ఈ సినిమా పై ఇంకా హైప్ తెచ్చారు. కాగ ఈ సినిమా ను ప్రీమియ‌ర్ షోలు, బెనిఫిట్ షోలు చూసిన వారు త‌మ రివ్యూ ను ట్విట్ట‌ర్ ద్వారా పంచుకుంటారు. ఇప్పుడు వారి ట్వీట్స్ ఆధారం గా పుష్ప రాజ్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడా.. లేదా అని చూద్దం.

ఈ సినిమా లో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ అద‌ర‌కొట్ట‌డాని తెలుస్తుంది. చాలా మంది కూడా పుష్ప రాజ్ వ‌న్ మెన్ షో అనే ట్వీట్స్ పెడుతున్నారు. అలాగే అల్లు అర్జున్ కేరీర్ లోనే ది బెస్ట్ సినిమా పుష్ప ఉంటుంద‌ని తెలుస్తుంది. ముఖ్యం గా పుష్ప రాజ్ ఫైట్స్, భిన్న మైన స్లాంగ్ తో డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ తో పాటు ఎమోష‌న్స్ సీన్ ల‌లో అల్లు అర్జున్ న‌ట‌న పీక్స్ లో ఉంద‌ని తెలుస్తుంది. అయితే అనసూయ‌, సునీల్ పాత్రలు కాస్త నిరాశ పెట్టేలా ఉన్నాయ‌ని తెలుస్తుంది.

అలాగే హీరోయిన్ ర‌ష్మిక మంద‌న న‌ట‌న సూప‌ర్ ఉంద‌ని తెలుస్తుంది. సినిమా చివ‌ర్లో 20 నిమిషాల పాటు అల్లు అర్జున్, ఫ‌హ‌ద్ ఫాజిల్ మ‌ధ్య వ‌చ్చే సీన్లు హైలైట్ గా ఉన్నాయ‌ని స‌మాచారం. ఏది ఏమైనా.. ఈ సినిమా ను చూస్తే కంప్లీట్ చేయ‌లేద‌నే ఒక ఫీలింగ్ మాత్రం వ‌స్తుంద‌ట‌. త‌ప్పకుండా పార్ట్ – 2 చూస్తేనే సంతృప్తి క‌లిగేలా ఉంటుంద‌ని తెలుస్తుంది. భారీ ట్విస్ట్ తో పార్ట్ – 1 ను ముగించి.. పార్ట్ – 2 కోసం ఎదురు చూడ‌క త‌ప్ప‌దు అనేలా ఉంద‌ని స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news