ఇకపై అలాంటి పాత్రలే చేస్తా.. రాశీ ఖన్నా కామెంట్స్

-

ఊహలు ఊహలు గుసగుసలాడేతో పరిచయమైన అందం పేరు రాశీ ఖన్నా. మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న రాశీ.. వరుస ప్రాజెక్ట్‌లో దూసుకుపోతోంది.హిట్స్‌తో సంబంధం లేకుండా రాశీకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ ప్రస్తుతం రాశీ ఫుల్ ఫామ్‌లో ఉంది. వెంకీమామ, ప్రతీరోజూ పండగే వంటి హిట్స్‌తో మంచి జోష్‌లో ఉంది.

అయితే తాజాగా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ మాత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. సినిమా ఫ్లాప్ అవ్వడం అటుంచితే.. అందులో రాశీ కనిపించిన తీరుకు ఫ్యాన్స్ తెగ హర్ట్ అయ్యారు. అందాల ఆరబోతకు, శృంగార సన్నివేశాలకు ఎటువంటి అడ్డు చెప్పలేదు. అంతవరకు హోమ్లీ హీరోయిన్‌గా చూసిన ఆమె ఫ్యాన్స్.. ఇలాంటి పాత్రలో చూసేసరికి ఫీలయ్యారు. తాజాగా రాశీ.. ఈ పాత్ర గురించి, భవిష్యత్ ప్రాజెక్ట్‌లోని తన పాత్రల గురించి హింట్ ఇచ్చింది.

తానిప్పుడు మంచి స్థాయికి చేరుకున్నానని, ఇకపై కలెక్షన్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని రాశీ పేర్కొంది. ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంలో అందాల ఆరబోతలో హద్దులు దాటినట్లు, ఇది మీకు అవసరమా అని అందరూ ప్రశ్నిస్తున్నారని.. ఇకపై నటిగా మరో మెట్టు ఎక్కేందుకు ఉపయోగపడే పాత్రలనే ఎంచుకుంటానని తెలిపింది. అందుకే ఇకపై గ్లామర్‌ విషయంలో హద్దులు మీరనని చెప్పుకొచ్చింది.

మహిళలను తక్కువ చేసి చూపించే విధంగా ఉన్నా సహించనని చెబుతోంది. అలాంటి సన్నివేశాలు తాను నటించే సినిమాలో ఉన్నట్లయితే.. అవి నిజంగా అవసరమా అని దర్శకులను నేరుగానే ప్రశ్నిస్తానని చెప్పుకొచ్చింది. అయితే వీటిపై నెటిజన్స్ మాత్రం సెటైర్స్ వేస్తున్నారు. కాస్త ఎక్కువైనట్టుంది.. ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూద్దాం నిజంగానే రాశీ చెప్పినట్టే చేస్తుందా? లేదా? అని.

Read more RELATED
Recommended to you

Exit mobile version