మెగాస్టార్ చిరంజీవి, రాధికా హీరో హీరోయిన్లుగా నటించిన సినిమాలు ఓ రేంజ్ లో ప్రేక్షకులను అలరించాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాలు భారీ వసూళ్లను సాధించాయి. అయితే ఇప్పుడు మరోసారి ఈ జంట ప్రేక్షకులను అలరించబోతుంది. కానీ హీరో హీరోయిన్లు గా కాదు.. చిరంజీవి హీరోగా నటించే కొత్త చిత్రానికి రాధిక నిర్మాతగా వ్యవహరించనున్నారు. రాధిక స్వయంగా ఈ విషయాన్ని పంచుకున్నారు.
తమ రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్లో తెలుగులో తీయబోయే చిత్రంలో చిరు హీరోగా నటిస్తున్నాడని వివరించారు. తమ చిత్రానికి ఓకే చెప్పినందుకు చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు వెల్లడిస్తామని రాధిక పేర్కొంది. అయితే ఇప్పటికే రాధికా రాడాన్ మీడియా వర్క్స్ పై సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అయితే రాధికా, చిరంజీవి కాంబోలో సినిమా అంటే.. మరోసారి మెగా అభిమానులకు ఆసక్తి నెలకొంది.