విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ నుంచి ‘రగిలే రగిలే’ సాంగ్ రిలీజ్

-

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం కింగ్డమ్. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. తాజాగా కింగ్డమ్ మూవీ నుంచి కొత్త సాంగ్ రిలీజ్ అయింది. రగిలే, రగిలే అంటూ సాగే ఈ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా.. అనిరుధ్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా జులై 31న విడుదల కానుంది.

ragile

మరోవైపు నిన్న రాత్రి యూసూఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో విజయ్ దేవరకొండ కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా మీ ప్రేమలో మాత్రం మార్పు ఉండదు. హైదరాబాద్ లో చాలా మంది అభిమానులను కలిశానని.. ఈసారి మనం హిట్ కొడుతున్నామని పేర్కొన్నాడు. నా సినిమా హిట్ కావాలని ఓ అభిమాని నా పోస్టర్ ను కుంభమేళాకు తీసుకెళ్లాడు. సినిమా విజయం అయితే మాత్రం అతన్ని తప్పకుండా కలుస్తానని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.

Read more RELATED
Recommended to you

Latest news