నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను వదిలిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను తాజాగా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 312 టీఎంసీలు.. ప్రస్తుతం 302 టీఎంసీల నీరు నిలువ ఉంది. ఔట్ ప్లో 41,985 క్యూ సెక్ లు కాగా..  సాగర్ ఇన్ ప్లో 2లక్షల క్యూ సెక్కులు.. తాజాగా మంత్రి అడ్లూరీ లక్ష్మణ్, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి నీటిని గేట్లు వదిలారు. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 8.40 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చారు. దాదాపు 10 గంటల వరకు వేచి చూసి అలిగి ఎమ్మెల్యే క్వార్టర్స్ కి వెళ్లారు. ఉదయం 11 గంటల తరువాత ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాస్త ఆలస్యంగా రావడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అలిగారు. మంత్రి  ప్రస్తుతం 2 గేట్లను ఎత్తారు. ఆ తరువాత మిగిలిన అన్ని గేట్లను ఒక్కొక్కటి మెల్లగా వదులుతారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్ట్ లో కూడా ఇవాళ ఉదయం 9 గంటలకే 6 గేట్లను వదిలారు. దీంతో జల కళ ఉట్టిపడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news