22 లక్షల ఎకరాలు.. కుడి కాలువ. ఎడమ కాలువ 10.4 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తుంది. నల్గొండ జిల్లాలో లక్షన్నర, 2.3 లక్షల ఎకరాలు, తెలంగాణ భూభాగంలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీరు అందిస్తుంది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. 1955 డిసెంబర్ 10న జవహర్ లాల్ నెహ్రు శంకుస్థాపన చేయగా.. ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్ట్ ని ఓపెన్ చేశారు. ఎడమ కాలువ పొడవు 117 కిలోమీటర్లు ఉంది. నాగార్జున సాగర్ ఆయా కట్టు కింద.. ఉన్న తాను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలవడం సంతోషంగా ఉంది.
జులై నెలలో పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్ నిండటం అదష్టంగా భావిస్తున్నామని తెలిపారు. 2004లో స్వర్ణోత్సవాలు నిర్వహించుకున్నామని తెలిపారు. ఎడమ కాలువ ద్వారా 3వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని తెలిపారు. జులై మాసంలో 18 సంవత్సరాల నాగార్జున్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి క్రస్ట్ గేట్లు ఎత్తడం ఇదే మొదటిసారి అని.. రికార్డు అని కూడా చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.