కాబోయే భార్యకు కమెడియన్ లిక్ లాక్..ఫోటో వైరల్ !

-

అర్జున్‌ రెడ్డి సినిమాతో పాపులర్‌ అయిన స్టార్‌ కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ… కెరీర్‌ సజావుగా సాగుతోంది. అయితే.. పర్సనరల్‌ లైఫ్‌ విషయంలోనే కొన్ని వదంతులు నటుడిని ఇబ్బంది పెడుతున్నాయి. భరత్‌ అనే నేను, గీత గోవిందం లాంటి హిట్‌ సినిమాల్లో నటించి.. మెప్పించిన రాహుల్‌ రామకృష్ణ చేతిలో ప్రస్తుతం విరాట పర్వం, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాల్లోనూ నటించారు కమెడియ్‌ రాహుల్‌ రామకృష్ణ.

ఈ కమెడియన్‌ సీక్రెట్‌ గా మ్యారేజ్‌ చేసుకున్నారని.. ఎప్పుడో ఓ ఇంటివాడు అయిపోయాడని టాక్‌ కొన్ని రోజుల నుంచి వస్తోంది. అయితే.. తాజాగా తన మ్యారేజ్‌ గురించి అప్డేట్‌ ఇచ్చాడు కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ. తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు రాహుల్‌ రామకృష్ణ. ఈ మేరకు తన కాబోయే భార్యకు లిప్‌ లాక్‌ ఇస్తూ.. ఓ పిక్‌ దిగాడు. ఆ పిక్‌ ను తన సోషల్‌ మీడియాలో పోస్టు చేసి.. తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news