నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. రాష్ట్రం లో నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని.. అన్నదాతలు జాగ్రత్త పడాలని వాతావరణ కేంద్రం అంది. మరి ఇక పూర్తి వివరాల లోకి వెళితే..
పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నార్మల్ గా కంటే రెండు, మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం ఉష్ణోగ్రతలు ని చూస్తే.. కరీంనగర్ లోని జమ్మికుంట లో అత్యధికంగా 44.4 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లిలో 44.3, భూపాలిపల్లి లోని కొత్తపల్లిగోరి లో 44.1 నమోదయ్యాయి.
ఇది ఇలా ఉంటే సూర్యాపేట జిల్లాలోని కీతవారిగూడెలంలో 44 డిగ్రీలు, ఆదిలాబాద్‌లోని చాప్రాలలో 43.9 డిగ్రీలు నమోదవ్వగా… కామారెడ్డిలోని బిక్నూర్‌లో 43.8, ఖమ్మం జిల్లా లోని నాగులవంచలో 43.6 డిగ్రీలు నమోదయ్యాయి. కొనుగోళ్లు కేంద్రాల్లో పూర్తి స్థాయిలో కొనుగోళ్లు మొదలు అవ్వలేదు దీనితో రెండు రోజుల కింద పడిన వర్షాలకు చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది. మరి కొన్ని చోట్లయితే తలకు సిద్ధంగా ఉన్న వరి పంట ధాన్యం రాలింది.