క్రియేటివ్‌ యాక్షన్‌ సర్వీస్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ తనయుడు హిమాన్షురావు

-

కల్వకుంట్ల హిమాన్షు… ఈ పేరుకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. హైదరాబాదులోని ఓక్రిడ్జ్ స్కూల్ స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు విజయం సాధించాడు. హిమాన్షు ఈ ఎన్నికల్లో క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ ప్రెసిడెంట్ గా పోటీ చేశాడు. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఈ ఏడాది నిర్వహించిన ఎన్నికల్లో ఇంటర్నేషనల్ ఒకలారియేట్ డిప్లమా ప్రోగ్రాం మొదటి సంవత్సరం చదువుతున్న హిమాన్షు సైతం పోటీ చేశాడు.

తొలుత నామినేషన్లు వేసిన విద్యార్థులను ఇంటర్వ్యూ చేసిన ఎన్నికల ప్యానెల్ చివరికి కొందరిని ఎంపిక చేసింది. పోటీలో ఉన్న విద్యార్థులంతా ఓపెన్ ఫోరం లో తమకు ఎందుకు ఓటు వేయాలో విద్యార్థులకు వివరించారు. ఓట్లను లెక్కించిన పాఠశాల యాజమాన్యం స్కూల్ స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలను ఇటీవలే ప్రకటించింది. శుక్రవారం గెలుపొందిన స్టూడెంట్ కౌన్సిల్ సభ్యులకు బాధ్యతలు అప్పగించింది.

Read more RELATED
Recommended to you

Latest news