ప్రధాన మంత్రి ట్వీట్ తో ఆనందం పట్టలేక బిర్యానీ పార్టీ ఇస్తున్న రాహుల్‌ సిప్లిగంజ్‌.!

-

రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ లు ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్స్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాజమౌళి ఈ సినిమా ను ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేస్తూ మరింత పేరు తీసుకొని వచ్చేలా చేస్తున్నాడు. ఏంజెల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ ఇంటర్నేషనల్ సినిమా వేడుకలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ తరుపున రాజ మౌళి, రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ కీరవాణి   పాల్గొన్నారు.

ఇక బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ సాంగ్ కి గానూ ఆర్ ఆర్ ఆర్ మూవీ  గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించింది. దీనితో దేశం మొత్తం ఆర్ ఆర్ ఆర్ మూవీ మేనియా తో ఊగిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ RRR టీం కు అభినందనలు తెలిపారు. ఆఖరికి దేశ ప్రధాన మంత్రి మోదీ కూడా అభినందనలు తెలిపారంటే హంగామా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక పాట పాడిన  రాహుల్‌ సిప్లిగంజ్‌ సాక్షాత్తూ  దేశ ప్రధాన మంత్రి ట్వీట్ చేసే సరికి ఆనందం తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. రాహుల్  మాట్లాడుతూ, `నాటు నాటు`పాట గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుని అందుకోవడం చాలా సంతోషంగా, ఎమోషనల్‌గా ఉంది. ఈ పాటలోని స్టెప్పులు ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా బాగా వైరల్‌ అయ్యాయి. ఈ సందర్భంగా నా ఇంటికి వచ్చే వారికి హైదరాబాదీ బిర్యానీతో ఆనందింప చేస్తాను. ఇలా బిర్యానీతో నా స్టయిల్ లో సెలబ్రేషన్‌ స్టార్ట్ చేస్తా` అని తెలిపారు రాహుల్‌ సిప్లిగంజ్‌.

Read more RELATED
Recommended to you

Latest news