మీ వల్లే నిజమైన ప్రేమ ఉందని నమ్మాను.. రాహుల్ ఎమోషనల్ పోస్ట్

బిగ్‌బాస్ మూడో సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే బిగ్‌బాస్ షోలో రాహుల్ చేసే ఎంటర్టైన్మెంట్ అలాంటిది మరి. దాదాపు వంద రోజుల పాటు సాగిన రియాల్టీ షోలో రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. టాప్ 5 కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇచ్చి చివరకు టైటిల్‌ను, ప్రైజ్‌మనీని ఎత్తుకెళ్లాడు. బిగ్‌బాస్ షో తరువాత రాహుల్ క్రేజ్ వంద రెట్లు పెరిగింది.

బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేయకముందు.. ప్లే బ్యాక్ సింగర్‌గా, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఉండేవాడు. అయితే బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చాక.. మరో కొత్త అవతారమెత్తాడు. విలక్షణ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ చిత్రంతో నటుడిగా వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతోన్నాడు. ఓ వైపు గాయకుడిగా బిజీగా ఉంటూనే..మరో వైపు నటనలోనూ ప్రవేశించి బిజీగా మారిపోయాడు.

తాజాగా రాహుల్ చేసిన ఓ ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. నేడు రాహుల్ తల్లిదండ్రుల పెళ్లి రోజు అంట. ఈ సందర్భంగా రాహుల్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘మామ్ అండ్ డాడ్.. మీ కమిట్మెంట్.. మీ ఆశీర్వాదం వల్లే మేము ఇలా ఉన్నాము.. ప్రేమ ఉందని, అది నిజమైన ప్రేమ ఉందని మీ ఇద్దరి వల్లే నమ్ముతున్నాను.. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే.. అది కేవలం మీ ఇద్దరి వల్లే.. మీరే నా ప్రపంచమని ఈ ప్రత్యేక రోజున మరోసారి చెప్పాలనుకుంటున్నాను.. నాకెప్పటికీ ఇష్టమైన జంట మీరే మమ్మీ డాడీ.. అందరికీ చెబుతున్నా.. ముందు తల్లీదండ్రులు తరువాతే దేవుడు’ అంటూ చేసిన పోస్ట్ నెజిజన్లను ఆకట్టుకుంటోంది.