కొరటాల శివ- చిరంజీవి సినిమాలో మహేష్ బాబు కన్‌ఫర్మ్ .. ఆయన సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే ..!

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో 152 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకోసం కొరటాల రెండేళ్ళ నుంచి వేయిట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం చరణ్ నటిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే చరణ్ అంటే ఆర్ ఆర్ ఆర్ కంప్లీటయ్యో వరకు ఆగాల్సిందే అని దాంతో ఈ సినిమా ఇంకా లేటవుతుందని చిత్ర బృందం డైలమాలో పడ్డారు.

 

 

దాంతో ఈ పాత్రలో మహేష్ బాబు నటిస్తే బావుంటుందని కొరటాల శివ-మెగాస్టార్ భావించారు. ఇదే విషయాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గర ప్రస్తావించగా ఆయన పాత్ర నచ్చితే మెగాస్టార్ తో కలిసి నటించడానికి సిద్దమని చెప్పాడు. కానీ అది జరిగే పనేనా ఈ ఇద్దరు కలిసి నటిస్తారా .. సాధ్యపడుతుందా అంటూ కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమాలో సూపర్ స్టార్ నటిస్తున్నారని అధికారకంగా వెల్లడైంది. ఈ సినిమాకోసం మహేష్ బాబు 25 రోజులు క్వాల్షీట్లు ఇచ్చారు. సూపర్ స్టార్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇక మెగాస్టార్ సినిమాలో సూపర్ స్టార్ నటించడానికి ఒప్పుకున్నందుకు 40 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారు. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

ఈ న్యూస్ అటు మెగా ఫ్యాన్స్ కి ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఉత్సాహాన్నిస్తోంది. ఇక మహేష్ ఈ సినిమాలో మే నుండి జాయిన్ కాబోతుండగా విజయదశమి లేదా దీపావళికి రిలీజ్ కాబోతోంది. ఇక న్యూస్ వచ్చినప్పటి నుంచి మన తెలుగు ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీకి షాకులివ్వబోతోందని ఈ రేంజ్ భారీ మల్టీ స్టారర్స్ బాలీవుడ్ లోనే కాదు ఇకపై టాలీవుడ్ లో రాబోతున్నాయని చర్చించుకుంటున్నారు.