కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ.. రాజ్ కుంద్రా ఇంట్రెస్టింగ్ పోస్టు

-

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి , ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాకు చెందిన విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గురువారం అటాచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్‌ కుంద్రా సోషల్ మీడియా ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్‌ పెట్టాడు. గర్జిస్తున్న సింహం ఫోటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేస్తూ.. ‘మీకు అగౌరవంగా అనిపించినప్పుడు ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి. అది ఓ రకంగా భిన్నమైన ఎదుగుదల లాంటిదే’ అంటూ పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

రాజ్‌కుంద్రా సంస్థ 2017లో బిట్‌కాయిన్ల రూపంలో సుమారు రూ.6,600 కోట్లు వ‌సూల్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వచ్చాయి. నెల‌కు ప‌ది శాతం రిట‌ర్న్స్ ఇస్తామ‌ని చెప్పి ఇన్వెస్టర్లను మోసం చేసిన‌ట్లు కేసు నమోదు కాగా..  ఈ స్కీమ్‌లో మాస్టర్‌మైండ్ అయిన అమిత్ భ‌ర‌ద్వాజ్ నుంచి రాజ్‌కుంద్రా సుమారు 285 బిట్‌కాయిన్లు తీసుకున్నట్లు సమాచారం. ఆ బిట్‌కాయిన్లతో ఉక్రెయిన్‌లో మైనింగ్ ఫార్మ్ తీసుకున్నట్లు ఆరోప‌ణ‌లు రావడంతో విచారణ చేపట్టిన ఈడీ.. శిల్పా శెట్టి, రాజ్‌ కుంద్రకు చెందిన రూ.98 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news