ఆ పార్టీకి నేను ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదు.. వీ.హెచ్. ఆసక్తికర వ్యాఖ్యలు

-

మతతత్వ పార్టీకి తాను ఎప్పుడూ మద్దతు తెలపలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కావాలని ఎవరో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తాను మాట్లాడని విషయాలను మాట్లాడినట్టు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవ్వరినీ వదిలిపెట్టబోనని.. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యంతా తాను ఎవ్వరి భూములను తీసుకోలేదని.. అక్రమంగా డబ్బులు సంపాదించలేదన్నారు. తనపై తప్పుడు ప్రచారం వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేసీఆర్ పరేషాన్ లో ఉన్నారు. ఆ పరేషాన్ లోనే ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. రాబోయే పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ కి 12కి పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగిసాక బీఆర్ఎస్ కనిపించడం కష్టమే అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే జరుగుతాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news