లావణ్య రాజ్ తరుణ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ తో పాటు మరో ఇద్దరు పై కేసు నమోదు అయింది. ఏ 1 గా రాజ్ తరున్, ఎ2 గా మాల్వి మల్హోత్రా, ఏ3 గా మయాంక్ మల్హోత్రాన్ని చేర్చారు నార్సింగ్ పోలీసులు. 2008 నుంచి రాజ్ తరుణ్ కు లావణ్య పరిచయం ఉందని విచారణలో తేలింది. 2010 లో లావణ్య కు ప్రపోజ్ చేశాడట రాజ్ తరుణ్. 2014లో రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడని లావణ్య వెల్లడించింది. రాజ్ తరుణ్ మా కుటుంబం అన్ని విధాలుగా ఆదుకుంది… రాజ్ తరుణ్ కు ఉన్న ఆర్థిక సమస్యలు మొత్తాన్ని మా కుటుంబం భరించిందని వివరించింది లావణ్య.
రాజ్ తరుణ్ కు ఇప్పటివరకు 70 లక్షల రూపాయలు ఇచ్చాము…. రాజ్ తరుణ్ కుక్కల కారణంగా 6 సంవత్సరాల్లో 6 ఇల్లులు మారాల్సి వచ్చిందని వెల్లడించారు. 2016లో నేను గర్భవతి అయ్యాను.. రెండవ నెలలో నాకు సర్జరీ చేశారన్నారు. నా హాస్పిటల్ బిల్స్ అన్ని రాజ్ తరుణ్ చెల్లించాడు… జనవరిలో నేను యుఎస్ నుండి తిరిగి వచ్చానని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నన్ను పోలీసులు అరెస్టు చేశారు…. నాపై డ్రగ్స్ కేస్ ఉందంటూ తప్పుడు ఆరోపణలతో పోలీసులు నన్ను రిమాండ్ చేశారని వివరించారు. 45 రోజులు నేను జైల్లో ఉన్నాను…. రాజ్ తరుణ్ తో పాటు మాల్వి మలహోత్రా ఇద్దరు కలిసి నన్ను ఇరికించారని ఫైర్ అయ్యారు. ప్రేమ,పెళ్లి పేరుతో మోసం చేసినందుకు రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోవాలనీ ఫిర్యాదులో పేర్కొన్నారు లావణ్య.