బాహుబలి వర్సెస్ 2.ఓ.. ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు

-

శంకర్ డైరక్షన్ లో వచ్చిన 2.ఓ మొదటి టార్గెట్ బాహుబలి. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా రెండు పార్టులు అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాయి. బాహుబలి బిగినింగ్ కంటే కన్ క్లూజన్ దాదాపు 2000 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. రాజమౌళి రికార్డులను బ్రేక్ చేసే సత్తా ఉన్న దర్శకుడు శంకర్ 2.ఓతో ఆ రికార్డులను బద్ధలు కొడతాడని భావించారు.

అనుకున్నట్టుగానే భారీస్థాయిలో 2.ఓ రిలీజైంది. సినిమాకు మంచి టాక్ వచ్చింది. అయితే 2.ఓ బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తుందా లేదా అన్నది పక్కన పెడితే మా దర్శకుడు గొప్ప అంటే మా దర్శకుడు గొప్ప అంటూ తెలుగు, తమిళ ప్రేక్షకులు సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు. బాహుబలితో రాజమౌళి నేషనల్ వైడ్ స్టార్ డైరక్టర్ అయ్యాడు. కాని శంకర్ ఎప్పుడో గ్రేట్ డైరక్టర్ అనిపించుకున్నాడు.

ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉంది. కాని ఫ్యాన్స్ ఊరుకుంటారా చెప్పండి. 2.ఓ బాహుబలి మొదటి రికార్డులను బ్రేక్ చేసిందని వార్తలు వస్తున్నాయి. వాటిని చూసి శంకర్ ఫ్యాన్స్ రాజమౌళి కన్నా శంకర్ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వారం తర్వాత 2.ఓ అసలు సీన్ ఉంటుందని రాజమౌళి ఫ్యాన్స్ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. ఇలా ఇద్దరి దర్శకుల అభిమానులు సోషల్ మీడియా వేదికగా గొడవ పడటం హాట్ న్యూస్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version