పోలీసుల కోసం రాజ‌మౌళి.. ఆర్ ఆర్ ఆర్ కంటే ముందే వారి ఫిల్మ్‌

-

రాజ‌మౌళి అంటే ఒక సంచ‌ల‌నం. ఆయ‌న ఏ సినిమా చేసినా హిట్ గురించి కంటే.. ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అనే మాట్లాడుకుంటారు. అలాంటి జ‌క్క‌న్న ఇప్పుడు సెన్సేష‌న‌ల్ ప్రాజెక్టు ఆర్ ఆర్ ఆర్ (RRR Movie) లోబిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే చాలావ‌ర‌కు షూటింగ్ కంప్లీట్ అయింది. అయితే ఇదిలా ఉండ‌గానే ఆయ‌న మ‌రో సినిమా చేయ‌బోతున్నారు.

ఆర్ ఆర్ ఆర్ కంటే ముందే దాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు. అయితే రాజ‌మౌళి చేయ‌బోయేది ఫీచ‌ర్ ఫిల్మ్ కాదు.. ఓన్లీ షార్ట్ ఫిల్మ్ అని తెలుస్తోంది. కేవ‌లం 19నిముషాల విడిది ఉన్న ఈ షార్ట్ ఫిలిమ్‌ను కొవిడ్ స‌మ‌యంలో ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌గా, ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి విధులు నిర్వ‌హిస్తున్న పోలీస్ డిపార్ట్‌మెంట్ గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేసేలా తీయ‌నున్నారు.

ఇప్ప‌టికే కొవిడ్ నియ‌మాలు పాటించాల‌ని రాజ‌మౌళి ఎన్నో వీడియోలు చేశారు. కానీ ఇప్పుడు డైరెక్టుగా ఓ షార్ట్ ఫిల్మ్‌ను తీస్తున్నారు. ఇందుకోసం ఈ షార్ట్ ఫిల్మ్ వివ‌రాల‌ను పోలీసు ఉన్న‌తాధికారుల‌కు తెలియ‌జేశారు రాజ‌మౌళి. ఇక దీనికి వారు ఓకే చెప్ప‌డంతో ఆ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యాడు ద‌ర్శ‌క‌ధీరుడు. ఈ షార్ట్ ఫిల్మ్ గురించి త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news