రాజమౌళి డైరెక్టర్ కాదు..కాంట్రాక్టర్: ప్రశాంత్ నీల్

బాహుబలి తో రాజమౌళి, కేజిఎఫ్ తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్లు గా మారిపోయారు.దక్షిణాది సినిమా వెలుగొందుతుంది, నార్త్ లో ప్రభంజనం సృష్టిస్తోంది..ఎంతగా అంటే సౌత్ సినిమా చూసి బాలీవుడే భయపడేంతగా.దీనంతటికీ కారణం రాజమౌళి, ప్రశాంత్ నీల్ లే.బాహుబలి తో రాజమౌళి ఓ బాట వేస్తే..కే జి ఎఫ్ తో ప్రశాంత్ నీల్ దాని హైవే గా మార్చేశాడు.మొన్నటికి మొన్న ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ లోనూ విజయ ఢంకా మోగించింది.ఇప్పుడు కే జి ఎఫ్ 2 వంతు వచ్చింది.మరికొద్ది గంటల్లో కేజిఎఫ్ బొమ్మ పడిపోతుంది.ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

అన్నీ కుదిరితే..తొలిరోజు వసూళ్లలో కేజిఎఫ్ కొత్త రికార్డులు వసూళ్లలోసృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు జోస్యం చెబుతున్నాయి.అయితే సౌత్ సినిమా ఈ స్థాయిలో విజ్రుంబించడానికి కారకుడు, మార్గదర్శకుడు రాజమౌళినే అంటూ క్రెడిట్ మొత్తం జక్కన్నకు ఇచ్చేశాడు ప్రశాంత్ నీల్.కేజి ఎఫ్ 2 ప్రీ రిలీజ్ వేడుకలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ చిన్న గల్లీ లాంటి పాన్ ఇండియా సినిమాని..8 రోడ్ల హైవే గా మార్చేశారు రాజమౌళి, ఆయన డైరెక్టర్ కాదు కాంట్రాక్టర్..దక్షిణాది సినిమా కిదక్షిణాది సినిమాకి ఇంత గుర్తింపు వచ్చిందంటే ఆయనే కారణం అంటూ కితాబు ఇచ్చాడు.