ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న ప్రాజెక్ట్ ఇదే…

-

టాలీవుడ్ లో రాజమౌళి కి ఉన్న డిమాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. జక్కన్న చేసే ప్రతీ సినిమా మీద ఆసక్తి ఉంటుంది జనాలకు. టాలీవుడ్ లో ఆయన సినిమాల కోసం అగ్ర హీరోలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. చాలా మంది హీరోలు ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఇది పక్కన పెడితే ఆయన ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత ఆయన ఏ సినిమా చేస్తారు అనేది స్పష్టత లేదు. అయితే ఇప్పుడు అయన ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తో ఒక భారీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. గోపి చంద్ విలన్ గా అల్లు అర్జున్ హీరోగా ఈ సినిమాను ప్లాన్ చేసినట్టు సమాచారం.

అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయిన తర్వాత కొన్ని రోజులు విరామం తీసుకుని ఈ సినిమా చెయ్యాలి అని చూస్తున్నారట. ఈ సినిమాలో మరో హీరో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గోపి చంద్ ఈ సినిమాలో సాడిస్ట్ గా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. బాలీవుడ్ నటులు కూడా ఇందులో ఉంటారని ఇది భారీ ప్రాజెక్ట్ గానే వస్తుంది అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version