రామ్ చరణ్, ఎన్టీఆర్ ని ఖాళీగా ఉంచని జక్కన్న…!

-

టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయినా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు కీలక సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమాను ఎలా అయినా సరే విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు. అల్లూరి సీతారామ రాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నాడు.

ఇప్పటికే సినిమాలో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన వీడియో ప్రోమో ని విడుదల చేసారు. దీనికి మంచి స్పందన వచ్చింది సోషల్ మీడియాలో. ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావంతో అన్నీ సినిమాల తరహాలో ఈ సినిమా షూటింగ్ కూడా ఆగింది. ఈ గ్యాప్ లో సమయాన్ని వృధా చేయడం ఎందుకు అని… డబ్బింగ్ మొదలుపెట్టింది చిత్ర యూనిట్. ఇద్ద‌రు హీరోల‌తో డ‌బ్బింగ్ చెప్పిస్తున్నార‌ని తెలుస్తుంది.

తమ ఇంట్లోనే వాళ్ళు డబ్బింగ్ చెప్తున్నట్టు సమాచారం. హోం థియేట‌ర్స్‌ను డ‌బ్బింగ్ థియేట‌ర్స్‌గా మార్చుకుని డ‌బ్బింగ్ చెప్తున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యాలని చూడగా కరోనా కారణంగా వాయిదా పడటంతో వేసవిలో విడుదల చెయ్యాలి అని సిద్దమవుతున్నారు. ఇప్పటికే మూడు సార్లు సినిమా షూటింగ్ ని వాయిదా వేసారు.

Read more RELATED
Recommended to you

Latest news