ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఉగాదికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఇది పక్కన పెడితే ఈ ఈ సినిమా విషయంలో దర్శకుడు రాజమౌళి చాలా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది ఎలా అయినాసరే విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న రాజమౌళికి… ఇటీవల కొన్ని సంఘటనలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి సంబంధించి ఒక సన్నివేశం కు సంబంధించిన వీడియో లీకై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఎన్టీఆర్ లుక్ ని పూర్తిగా మార్చే ప్రయత్నం చేశారు రాజమౌళి.
ఇక ఇప్పుడు ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన ఒక సన్నివేశాన్ని షూట్ చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఒక కార్మికుడు దానిని ఫోన్లో రికార్డ్ చేసే ప్రయత్నం చేశారట. దానిని వెంటనే గుర్తించిన రాజమౌళి అతని వద్దకు వెళ్లి ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టారట రాజమౌళి. అదే విధంగా అతనికి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇచ్చేసి అక్కడి నుంచి పంపిణీ చేసినట్టు సమాచారం. ఇక ఆ సమయంలోనే అక్కడ ఉన్న కొంతమందికి ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట. మరోసారి ఇక్కడకు వచ్చే ఎవరు కూడా ఫోన్ తీసుకుని రావొద్దని, అదే విధంగా వ్యక్తిగత కెమెరాలు కూడా అనుమతించేది లేదని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.