ఫ్లాష్.. ఫ్లాష్‌.. బిగ్‌బాస్‌ 4 హోస్ట్‌గా మహేష్‌ బాబు..?

-

బుల్లితెరపైన మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలుగు బిగ్‌ బాస్‌ షో త్వరలోనే నాలుగో సీజన్‌కు ముస్తాబవుతోంది. గత సీజన్‌లో నాగార్జున ప్రేక్షకులను అలరించగా, పెద్దగా వివాదాలకు తావు లేకుండానే ఆ షోను ముగించారు. ఇక త్వరలో నాలుగో సీజన్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో ఆ షో కోసం నిర్వాహకులు ఇప్పటి నుంచే కంటెస్టెంట్ల వేట మొదలు పెట్టారు. అయితే కంటెస్టెంట్ల మాట అటుంచితే.. 4వ సీజన్‌కు హోస్ట్‌గా మహేష్‌ బాబు రానున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.

big boss 4 telugu host will be mahesh babu say sources

బిగ్‌బాస్‌ నిర్వాహకులు నాలుగో సీజన్‌కు హోస్ట్‌గా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబును రప్పించాలని అనుకుంటున్నారట. అందులో భాగంగానే వారు ఈ విషయమై ఇప్పటికే మహేష్‌ బాబును సంప్రదించారని తెలుస్తోంది. అయితే మొదటగా ఎన్‌టీఆర్‌నే మళ్లీ నాలుగో సీజన్‌కు తీసుకువద్దామని, అవసరమైతే భారీగా పారితోషికం ఇద్దామని అనుకున్నారట. కానీ ఎన్‌టీఆర్‌ను సంప్రదిస్తే ఆయన ఈ షోకు హోస్ట్‌గా వచ్చేందుకు అంతగా ఆసక్తిని చూపలేదట. మరోవైపు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నందున దర్శకుడు రాజమౌళి ఎన్‌టీఆర్‌కు బిగ్‌బాస్‌ షోకు హోస్ట్‌గా వెళ్లేందుకు అనుమతి ఇస్తారా, ఇవ్వరా అని అనుమానంగా మారిందట. అందుకనే తారక్‌ ఈ సారి ఆఫర్‌ను తిరస్కరించారని తెలుస్తోంది.

అయితే తారక్‌ విముఖత వ్యక్తం చేయడంతో బిగ్‌బాస్‌ నిర్వాహకులు వెంటనే మహేష్‌ బాబును సంప్రదించారని తెలుస్తోంది. అయితే మహేష్‌ బాబు కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్లు ఫిలిం నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. మహేష్‌ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చేందుకు బిగ్‌బాస్‌ షో సరైన వేదిక అని భావిస్తున్నారట. అందుకని ఈ సారి ఈ షోకు మహేష్‌ హోస్ట్‌గా దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని షో నిర్వాహకులు ఇంకా ధ్రువీకరించలేదు. కానీ దాదాపుగా మహేష్‌నే ఫైనల్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయం తేలాలంటే ఇంకా కొంత కాలం వరకు వేచి చూడక తప్పదు..!

Read more RELATED
Recommended to you

Latest news