సైరా ఎఫెక్ట్‌: రాజ‌మౌళిలో టెన్ష‌న్‌… R R R కు రిపేర్లు

-

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా అంతా బాగానే ఉంది. హిట్ టాక్‌ కూడా వచ్చింది. కాని వసూళ్లు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో మినహా మిగిలిన రాష్ట్రాల్లో అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్… బాలీవుడ్ లో డిజాస్ట‌ర్‌గా తేల్చేశారు. ఈ సినిమాకు ముందు నుంచి పాన్ ఇండియా సినిమాగా భారీ ఎత్తున ప్రచారం చేశారు. అయితే సినిమాలో ఉన్న మేజర్ కంప్లైంట్ ఏంటంటే పాన్ ఇండియా సినిమాకు తగిన కంటెంట్‌ లేదన్నది కొందరి వాదన.

సైరా సినిమా ఏపీలో కేవ‌లం క‌ర్నూలు జిల్లాకు చెందిన స్టోరీ. బాహుబలి, కేజీఎఫ్, సాహో లాంటి సినిమాలు పొరుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వడానికి, సైరా ఫెయిల్ అవ్వడానికి ఇదే ప్రధానమైన తేడా. ఇక ఇప్పుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ కూడా తెలుగు నేటివిటి ఉన్న స్టోరీయే. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ అంటూ తెలుగువీరుల కథలను తెరపైకి తీసుకొచ్చాడు రాజమౌళి. ఒకే కాలానికి చెందినవారే అయినప్పటికీ ఇద్దరివీ వేర్వేరు నేపథ్యాలు.

అసలు వీళ్లు ఎప్పుడూ ఒక‌రికొక‌రు క‌ల‌వ‌లేదు. అలాంటిది వీరు ఇద్ద‌రు క‌లిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుంది ? అన్న క‌థాంశంతో ఈ సినిమా తీస్తున్నారు. అయితే సైరా తెలుగు క‌థ‌తో తెర‌కెక్కి ఇత‌ర భాష‌ల్లో కనెక్ట్ కాక‌పోవ‌డంతో ఇప్పుడు అదే తెలుగు వీరుల క‌థ‌తో తెర‌కెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ ఏం అవుతుందో ? అన్న టెన్ష‌న్ రాజ‌మౌళిని వెంటాడుతోంద‌ట‌. ఎంత రాజ‌మౌళి అయినా స్థానిక‌త ఎక్కువైతే మిగిలిన భాష‌ల ప్రేక్ష‌కుల రిసీవింగ్ ఎలా ఉంటుందా ? అన్న టెన్ష‌న్‌తో ఈ క‌థ‌కు యూనివ‌ర్సిల్ అప్పీలింగ్ ఉండేలా స్థానిక‌త హైలెట్ కాకుండా చేస్తున్నాడ‌ట‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version