RRR కోసం రాజమౌళి వర్క్ షాప్

-

రాజమౌళి చేస్తున్న మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమా డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ముందు ఎన్.టి.ఆర్ ఆ తర్వాత చరణ్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారట. పిరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా కోసం ఓ మూడు వారాల వర్క్ షాప్ నిర్వహించనున్నారట. ఇద్దరు హీరోలకు కథ చెప్పి పాత్రలు వాటి స్వభావాల మీద పూర్తిగా డిస్కస్ చేస్తారట.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను డివివి దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తారని తెలుస్తుంది. చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తుండగా ఎన్.టి.ఆర్ కొంత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. మెగా నందమూరి హీరోల ఈ మెగా మల్టీస్టారర్ మూవీ బాహుబలి రికార్డులను బీట్ చేస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news