రజిని.. రాజమౌళి సినిమా ఉంటుందా..!

-

సూపర్ స్టార్ రజినికాంత్ తో రాజమౌళి లాంటి డైరక్టర్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది. అబ్బో ఇక ఆ సినిమా అంచనాలకు ఆకాశమే హద్ధని చెప్పొచ్చు. అలాంటి క్రేజీ కాంబినేషన్ త్వరలో ఉంటుందని కోలీవుడ్ ఇన్నర్ టాక్. 2.ఓ తర్వాత రజినికాంత్ పేట సినిమాలో నటించాడు. కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది.

ఇక ఈ సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తోనే మురుగదాస్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడు రజినికాంత్. ఈ సినిమా కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ పేట డైరక్టర్ కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట రజినికాంత్.

ఈ రెండు సినిమాల తర్వాత రజిని టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళితో సినిమా చేస్తాడని అంటున్నారు. పేట ఇంటర్వ్యూలో రాజమౌళి సినిమాపై రజిని రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత అసలైతే మహేష్ తో సినిమా చేయాల్సి ఉంది. మహేష్ అందుబాటులో లేకుంటే రాజమౌళి రజని కాంబో షురూ అయినట్టే. ఒకవేళ ఆ కాంబో సెట్ అయితే బాహుబలి నాన్ బాహుబలి అని తేడా లేకుండా అన్ని రికార్డులు కొల్లగొట్టడం ఖాయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version