‘పెట్ట’ మూవీ రజిని స్టైలిష్ లుక్ లీక్

-

సూపర్ స్టార్ రజినికాంత్ రోబో సీక్వల్ గా చేస్తున్న 2.ఓ రిలీజ్ అవుతుందో లేదో తెలియదు కాని ఆ సినిమా తర్వాత ఒప్పుకున్న సినిమాలన్ని వస్తున్నాయ్.. వెళ్తున్నాయి. కబాలి తర్వాత ఈమధ్యనే కాలాగా వచ్చి ప్రేక్షకులను పలుకరించిన రజిని ప్రస్తుతం పెట్ట సినిమాతో వస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుండి వచ్చిన మోషన్ పోస్టర్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. రజినిలో అందరు ఇష్టపడే స్టైల్ పెట్ట పోస్టర్ లో ఉండే సరికి ఆ మోషన్ పోస్టర్ చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు.

ఇక మరో పక్క ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుండి లీకైన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం యూపిలో లక్నోలో షూటింగ్ జరుపుకుంటున్న పెట్ట మూవీ నుండి రెడ్ కలర్ షర్ట్.. బ్లూ కలర్ స్కార్ఫ్ తో స్టైలిష్ గా కూర్చున్న రజిని స్టిల్, ఇంకా షూటింగ్ స్పాట్ లోని కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. ఈ ఫోటోలు చూస్తే ముత్తు సినిమా టైంలో రజినికాంత్ గుర్తుకు వస్తున్నాడు.

రజినిలోని మాస్ పవర్ ను ఈమధ్య వచ్చిన సినిమాల్లో సరిగా వాడలేదు. అందుకే కార్తిక్ సుబ్బరాజు పెట్టలో అసలు సిసలు రజిని స్టామినా చూపించబోతున్నాడట. ఓ పక్క 2.ఓ రిలీజ్ కు సన్నాహాలు చేస్తుండగా మరో పక్క పెట్ట సినిమాను రెడీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ భారీ పోలీస్ భధ్రతతో చేస్తున్నారట. మరి రజిని పెట్ట లీకైన పిక్స్ కేక పెట్టిస్తుండగా సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version