ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు సుప్రీం కోర్టుకు చేరింది. ఏపీలో ఎలక్షన్ తర్వాత నుండి ముంబై నటి జెత్వానీ కేసుకు సంబంధించి రోజుకో వార్త వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ నటి కాదంబరి జెత్వానీ పై వేధింపుల కేసులో కీలక నిందితుడు అయిన కుక్కల విద్యాసాగర్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. విద్యాసాగర్ పిటిషన్ ను విచారించింది జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్‌ల ధర్మాసనం.
అయితే ట్రయల్ కోర్టులో ఇప్పటికే బెయిల్ అప్లికేషన్ దాఖలు చేసినట్లు సుప్రీం కోర్టుకు వివరించారు విద్యాసాగర్ తరపు న్యాయవాదులు. బెయిల్ అప్లికేషన్ పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనంను కోరారు విద్యాసాగర్ రావు తరపు న్యాయవాది. అయితే మూడు వారాల్లో బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని కింది కోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసులో ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు.