తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం జైలర్ . ఈ సినిమా భారీ సక్సెస్ అందుకోవడంతో సూపర్ స్టార్ రజినీకాంత్ కి కూడా మంచి గుర్తింపు లభించింది.. ఇదిలా గత రెండు రోజులుగా రజనీకాంత్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అసలు విషయంలోకి వెళితే జైలర్ సినిమా విడుదల తర్వాత హిమాలయాలకు వెళ్లిన రజనీకాంత్ అటు నుంచి అటే మహావతార్ గుహకు వెళ్లి అక్కడి నుంచి యూపీ సీఎం యోగి వద్దకు వెళ్లారు. అయితే ఆ తర్వాత యోగి ని చూస్తూ ఆయన కాళ్లకు మొక్కడం అందరికీ తెలిసిందే.
అయితే వయసులో రజిని చాలా పెద్దోడు.. యోగి చాలా చిన్నవాడు.. అలాంటిది రజినీ ఇలా ఎందుకు చేశాడు? తమిళనాడు మొత్తం నీకు వంగి మొక్కుతుంటే నువ్వెళ్ళి యోగి కి మొక్కుతావా.. మా ఆత్మ అభిమానాన్ని దెబ్బతీశావు అంటూ తన అభిమానులు కూడా రజినీకాంత్ పై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు చాలామంది రజిని చేసింది తప్పు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం దానిని సమర్థించారు.. యోగి సీఎం అని కాళ్ళు మొక్కలేదు.. అతను ఒక మత గురువు, పీఠాధిపతి కాబట్టే ఆయన కాళ్లు మొక్కాడు.. అంతే తప్ప అక్కడ సీఎం కదా.. పవర్ ఉంది కదా.. అని రజనీకాంత్ కాళ్లు మొక్క లేదు అంటూ ఒక వర్గం వారు రజినీకాంత్ చేసిన పనిని సమర్థిస్తూ వచ్చారు.
అయితే తమిళ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. మరోపక్క ఈ వార్తలు బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా చెన్నైలో ల్యాండ్ అయిన రజనీకాంత్ ను మీడియా ప్రశ్నలతో ఇబ్బంది పెట్టేసింది. ఇక తన మీద వచ్చిన విమర్శలకు ఆయన సమాధానం చెప్పారు. ” వయసులో చిన్న వారైనా.. పెద్దవారైనా కూడా మత గురువు , మఠాధిపతి యోగి స్వామీజీ అయితే నేను కాళ్లకు నమస్కరిస్తాను. అది నా అలవాటు” అంటూ ఒక్క మాటతో వివాదానికి పుల్ స్టాప్ పెట్టేశారు రజనీకాంత్. మరి ఈ విషయాన్ని తమిళ్ తంబీలు ఎలా తీసుకుంటారో చూడాలి.