శ్రావణ మాసంలో పచ్చగాజులు వేసుకుంటే… ఎంత మంచిదో తెలుసా..?

-

శ్రావణమాసంలో మనం అమ్మవారిని ఆరాధించడం వలన మన కోరికలు నెరవేరుతాయి. ఎంతో మంచి జరుగుతుంది. ఈ సారి శ్రావణ మాసం ఆగస్టు 17న మొదలైంది సెప్టెంబర్ 15 వరకు శ్రావణ మాసం ఉంటుంది అయితే హిందూ మతం ప్రకారం ఈ రోజున ఆకుపచ్చ రంగు వస్తువులను ఉంచుకోవడం లేదంటే ధరించడం ఎంతో మంచిదట. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆకు పచ్చ రంగు బుధ గ్రహాని కి సంబంధించినది పచ్చని వాటిని కనుక మీ దగ్గర ఉంచుకుంటే బుద్ధ గ్రహం సంతోష పడుతుందని అంటున్నారు.

పండితులు పచ్చని ప్రకృతి కి ప్రతీక. శ్రావణ మాసం లో పచ్చని గాజులు ధరిస్తే, చాలా మంచి జరుగుతుంది. ఆకుపచ్చ రంగు గాజులను వేసుకుంటే, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆకుపచ్చ రంగు గాజులని వేసుకోవడం వలన వరలక్ష్మి దేవి, మంగళ గౌరీ దేవి మంచి చేస్తారు. పైగా శుభం జరుగుతుంది.

శ్రావణమాసంలో ముత్తైదుగులు పచ్చని గాజులు వేసుకుని నోములు చేస్తే చాలా మంచి జరుగుతుంది. శ్రావణమాసంలో పచ్చని గాజులు వేసుకుంటే ఎంతో శుభప్రదం. పచ్చని గాజులు వేసుకుని శంకరుడుని కొలిస్తే ఎంతో మేలు కలుగుతుందట. ఆకుపచ్చ రంగు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. శ్రావణమాసంలో పచ్చని గాజులు వేసుకుని దేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు. ముత్తైదువులకి గాజులుని వాయినం గా కూడా ఇస్తూ ఉంటారు. ఇలా పచ్చని గాజులని వేసుకుంటే ఇన్ని లాభాలని పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news