పేదలకు గ్యాస్‌ ‘బండే’.. ‘క్యాభ్‌’ అధ్యయనంలో వెల్లడి

-

దేశంలో పేదలకు వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరే గుదిబండగా మారిందని స్వచ్ఛ గాలి, మెరుగైన ఆరోగ్యం (క్యాభ్‌) ప్రాజెక్టు జరిపిన అధ్యయనంలో తేలింది. దరఖాస్తు ప్రక్రియలోని సంక్లిష్టత, డెలివరీలోని లోపాలు, ఫిర్యాదులు చేస్తే పరిష్కరించే యంత్రాంగం లేకపోవడం వంటివీ వారు వంట గ్యాస్‌ (ఎల్‌పీజీ) వాడటానికి విముఖత చూపడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని తేలింది. ఈ అధ్యయనంలో అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్‌ఏఐడీ) పాలుపంచుకుంది.

క్యాభ్‌ అధ్యయనంలోని వివరాల ప్రకారం.. సిలిండర్లను రీఫిల్‌ చేసుకోవడమే వారికి పెద్ద భారంగా మారింది. వారి ఆదాయాల్లో హెచ్చుతగ్గులు ఇబ్బందికరంగా ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఇప్పటికీ 41శాతం మంది పేదలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా కట్టెల పొయ్యిలనే వాడుతున్నారు. ఝార్ఖండ్‌లో 67.8శాతం మంది.. దిల్లీలో అతి తక్కువగా 0.8శాతం మందే కట్టెల పొయ్యిలను వాడుతున్నారు. సులభంగా అందుబాటులో ఉన్న వాటినే వంటకు పేదలు వినియోగిస్తున్నారు. దీంతోపాటు ఆర్థిక సమస్యలవల్లా ఎల్‌పీజీ వాడలేకపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news