రజినీకాంత్‌ “దర్బార్‌” ఫస్ట్‌ లుక్‌.. తలైవా వా వావా…. అదిరిందంతే

141

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌, మురుగదాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి దర్బార్‌ పేరును ఖరారు చేస్తూ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌ చూస్తుంటే మాఫియా కథాంశంతో రూపొందుతున్నట్లు అర్థమవుతుంది. “YOU DECIDE WHETHER YOU WANT ME TO BE GOOD OR BAD OR WORSE” అంటూ పోస్టర్‌పై రాసి ఉండటాన్ని బట్టి చూస్తే రజినీ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. మొత్తానికి ఫస్ట్‌లుక్‌తో సినిమా కథాంశం హీరో క్యారెక్టర్‌ రివీల్‌ చేశాడన్నమాట.

Rajinikanth's next movie titled Darbar.. Darbar first look
Rajinikanth’s next movie titled Darbar.. Darbar first look

మురగదాస్‌, రజినీ కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉండాలో ఊహలకు అందనిది.. సామాజికాంశాలను ఆకట్టుకునేలా తెరకెక్కించే మురుగదాస్‌, ఇప్పడు రాజకీయపార్టీ పెట్టిన రజినీ ఇద్దరు కలిసి చేసే సినిమా ఎట్టిపరిస్థితుల్లో మెసేజ్‌ ఓరియంటెడ్‌ అయి ఉంటుంది. ఇక రజినీకాంత్‌కి జోడీగా నయనతార నటిస్తుంది. ఇప్పటికే నయనతార – రజనీకాంత్ ల కాంబినేషన్ లో చంద్రముఖి , కథానాయకుడు చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే . కాగా ఈ చిత్రానికి యువకెరటం అనిరుద్ధ మ్యూజిక్‌ని అందిస్తున్నాడు. సుభాస్కరన్‌ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. 2020 సంక్రాంత్రికి విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.