చైనాలో రిలీజ్ అవుతున్న నాని ‘జెర్సీ’

-

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా జెర్సీ. క్రికెటర్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 19న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా కోసం నాని క్రికెట్ నేర్చుకున్నాడు. 30 ఏళ్ల తర్వాత క్రికెట్ లో తన గోల్ రీచ్ అవడానికి హీరో ఎంత కష్టపడ్డాడు అన్నది జెర్సీ కథ. అయితే ఈ సినిమాను చైనాలో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

చైనా క్రికెట్ కు దూరం కదా మరి ఈ సినిమా అక్కడ ఎందుకు రిలీజ్ చేస్తారని అనుకోవచ్చు. జెర్సీ యూనివర్సల్ కాన్సెప్ట్ ఎమోషన్ క్యారీ అయితే ఎక్కడైనా చూస్తారట. అయితే చైనాలో రిలీజ్ చేస్తే పెద్ద ఎత్తునే రిలీజ్ చేస్తామని అంటున్నారు జెర్సీ నిర్మాత నాగ వంశీ. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 19న తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతుంది. సినిమా ఫలితాన్ని బట్టి మిగతా భాషల్లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news