మ‌రో వివాదంలో ఇరుక్కున్న రాకేశ్ మాస్ట‌ర్‌.. దేవుడిని అలా అన్నందుకే!

ఎప్పుడు ఏదో ఒక వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ.. సంచ‌ల‌నంగా మారుతుంటారు డ్యాన్స్ మాస్ట‌ర్ రాకేశ్‌. ఈయ‌న ఇంట‌ర్వ్యూల‌లో ప‌దే ప‌దే టాలీవుడ్ సెల‌బ్రిటీల‌పై సంచ‌ల‌న కామెంట్లు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తుంటారు. కొన్ని సార్లు వ్య‌తిరేక‌త‌ను కూడా ఎదుర్కొన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే ఈయ‌న ఇంట‌ర్వ్యూల కోసం ప‌లు ఛానళ్లు కూడా ఎగ‌బ‌డుతుంటాయి.

ఇక మ‌నుషుల‌పైనే కాకుండా.. ఓ ఇంట‌ర్వ్యూలో శ్రీకృష్ణుడిపై చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆయ‌న మీద దాడి చేసే వ‌ర‌కు తెచ్చాయి. దీనిపై గ‌తంలో కేసు కూడా న‌మోదైంది. ప‌లు హిందూ సంఘాలు ఈయ‌న వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించాయి.

అంతే కాదు.. ఇప్పుడు శ్రీ కృష్ణ నగర్ లో నివసించే ఆయ‌న ఇంటిపై ఆదివారం సాయంత్రం 5:30గంట‌ల‌కు ప‌లువురు దాడి చేశారు. సాయి యాదవ్, ఇమ్రాన్ తదితరులు రాకేశ్ ఇంట్లోకి ప్రవేశించి నానా హంగామా చేశారు. ఆయ‌న‌ను తిడుతూ.. ఇంట్లోని స‌మాన్లు ధ్వంసం చేశారు. ఈ దాడిపై ఆయ‌న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇక శ్రీ కృష్ణుడుపై చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను యాదవుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేకల రాములు సోమవారం పోలీసులకు కంప్లైంట్ చేయ‌డంతో ఆయ‌న‌పై కూడా న‌మోదైంది.