హైకోర్ట్ కి ఈటెల ఉద్యోగి… గేమ్ మొదలుపెట్టిన ఈటెల

మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర కోర్ట్ లో అడుగు పెట్టారు. మెదక్ జిల్లా అచ్చంపేట,హకీమ్ పేట హచరిస్ భూముల వివాదం కోర్ట్ కి చేరింది. నిన్న జమున హచరిస్ డైరెక్టర్ లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. జమున హచరిస్ నిర్మాణ పనుల్లో జోక్యం చేస్కోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్ట్ ను పిటీషనర్ విజ్ఞప్తి చేసారు. క్లియర్ టైటిల్ ఉన్న జమున హచరిస్ నిర్మాణం పై ఉద్దేశ పూర్వకంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.

తప్పుడు రిపోర్ట్స్ తో జమున భూములను స్వాధీనం చేస్కోవాలని చూస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఎలాంటి నోటీస్ లు ఇవ్వకుండా తమ జమున హచరిస్ భూముల్లో సర్వే చూశారని పిటిషన్ లో నితిన్ రెడ్డి ఆరోపించారు. నిరాధారమైన ఆరోపణ లతో విచారణ కమిటీలు దౌర్జన్యం గా జామున హచరిస్ భూముల్లో విచారణ చేస్తున్నాయని తెలిపారు. పిటిషన్ తరపున దేశాయ్ ప్రకాష్ వాదనలు వినిపిస్తారు. ఇవ్వాళ పిటిషన్ విచారణ చేయనున్న హై కోర్టు.