టీటీడీలో కొత్త వివాదం… ప్రభుత్వానికి ఇబ్బందేనా…?

టీటీడీలో మరో వివాదం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. తనకు అన్యాయం జరిగిందంటూ శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు హైకోర్ట్ కి వెళ్ళారు. గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకుడిగా కొనసాగుతుండగా తమ కుటుంబం నుంచే రమణ దీక్షితులను ప్రధాన అర్చకుడిగా నియమించడాన్ని హైకోర్టులో వేణుగోపాలదీక్షితులు సవాల్ చేసారు.

ttd

పిటీషన్ లో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ, రమణ దీక్షితులను వేణుగోపాల దీక్షితులు పేర్కొన్నారు. హైకోర్ట్ ఈ పిల్ స్వీకరించింది. ప్రభుత్వం, టీటీడీ, రమణ దీక్షితులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా కొనసాగుతూ ప్రభుత్వం, టీటీడీ పై కోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు ఈ వివాదంలో ఏ మలుపులు తిరుగుతాయి అనే దానిపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.