స్టార్ హీరోయిన్ రకుల్ ఈమధ్య క్రేజ్ తగ్గినట్టు కనిపించినా అమ్మడి డిమాండ్ మాత్రం మాములుగా లేదని తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ స్పైడర్ తో ఫ్లాప్ చవిచూసిన రకుల్ ఆ తర్వాత ఏ ఒక్క స్టార్ అవకాశాన్ని అందుకోలేదు. లేటెస్ట్ గా ఎన్.టి.ఆర్ బయోపిక్ లో రకుల్ నటిస్తున్న విషయం తెలిసిందే. అందాలతార శ్రీదేవిగా రకుల్ నటిస్తుంది. ఈమధ్యనే రకుల్ పుట్టినరోజు నాడు శ్రీదేవి లుక్ లో రకుల్ సర్ ప్రైజ్ ఇచ్చింది.
ఈ సినిమాలో రకుల్ నటించేందుకు కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకుందట. రెండు పార్టులుగా వస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ లో మొదటిగా వస్తున్న ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాలో రకుల్ శ్రీదేవిగా కనిపిస్తుంది. 20 నిమిషాలు కనిపించే ఆ రోల్ కోసం ఏకంగా కోటి తీసుకుందట రకుల్. ఛాన్సులు రావట్లేదని అంటూనే వచ్చిన అవకాశంలో మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు అమ్మడు. ఎన్.టి.ఆర్, శ్రీదేవి ఆకుచాటు పిందె తడిసే పాటకు బాలయ్య, రకుల్ కాలుకదుపుతారని తెలుస్తుంది.