జాకీ భగ్నానీతో రకుల్ వివాహం.. నెట్టింట వెడ్డింగ్ ఇన్విటేషన్ వైరల్

-

పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలియనివారుండరు. ఈ భామ తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపుతెచ్చుకుని సూపర్ హిట్ సినిమాలు తీసి ఇప్పుడు బాలీవుడ్‌లో సెటిల్ అయింది. అక్కడి నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోంది. ఫిబ్రవరి 21వ తేదీన గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఇప్పటికే అంతా రెడీ అయింది. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, అతి కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ షురూ కూడా అయ్యాయి.

- Advertisement -

అయితే తాజాగా రకుల్‌-జాకీల వివాహ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఇన్విటేషన్ చాలా డిఫరెంట్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రకుల్, జాకీలకు కంగ్రాట్స్ చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే రకుల్-జాకీ తమ పెళ్లికి డిజైనర్లను కూడా లాక్‌ చేశారు. మూడు రోజుల పాటు వీరి వివాహ వేడుక జరగనుండటంతో రోజుకొక డిజైనర్ తయారుచేసిన దుస్తుల్ని ధరించబోతున్నారట. సబ్యసాచి, తరుణ్ తహిల్యానీ, మనీష్ మల్హోత్రా పెళ్లి దుస్తులు డిజైన్ చేశారట.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...