ఎన్టీఆర్ బయోపిక్.. శ్రీదేవి వచ్చేసింది

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో శ్రీదేవిగా క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుందని కొన్నాళ్లుగా వస్తున్న వార్తే. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ ఈరోజు రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఆమె లుక్ రివీల్ చేశారు. తెలుగు తెర అందాల తారగా వెలుగొందిన శ్రీదేవిగా రకుల్ చేయడం అంటే మాములు విషయం కాదు.

ఫస్ట్ లుక్ లో శ్రీదేవిగా రకుల్ మెప్పించిందని చెప్పొచ్చు. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఎన్.టి.ఆర్ మూవీలో చాలా వరకు స్టార్స్ నటిస్తుండటం విశేషం. ఇక రెండు పార్టులుగా రానున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా జనవరి 9న రిలీజ్ కాబోతుంది. సినిమాలో ఏయన్నార్ గా సుమంత్, హరికృష్ణ గా కళ్యాణ్ రాం, శ్రీదేవిగా రకుల్ నటిస్తున్నారు. ఇక వీరే కాకుండా చాలమంది స్టార్స్ ఇందులో ఉన్నారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news